కౌలు రైతును ఆదుకునేదెప్పుడో..
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:27 PM
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏడాదిన్నర గడి చినా నెరవేరడం లేదు. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతులకు ఏటా రూ. 15వేలు చెస్తా మని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
-రూ. 15వేలు చెల్లిస్తామన్న కాంగ్రెస్
-ఏడాదిన్నర గడిచినా ఊసే ఎత్తని ప్రభుత్వం
-యేటేటా పెరుగుతున్న కౌలు రేట్లు
-కౌలు చట్టాలు అమలైతే 3 వేల మందికి మేలు
మంచిర్యాల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏడాదిన్నర గడి చినా నెరవేరడం లేదు. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతులకు ఏటా రూ. 15వేలు చెస్తా మని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాటను వి స్మరించడంతో కౌలు రైతుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక దశలో కసరత్తు ప్రారంభించినప్పటికీ అది కార్యరూ పం దాల్చలేదు. కాంగ్రెస్ హామీ అమలైతే కౌలు రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
యేటా పెరుగుతున్న కౌలు ధరలు...
భూముల కౌలు రేట్లు ప్రతియేటా పెరుగుతుండ టంతో రైతులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం నీటి వసతులు ఉన్నచోట ఎకరా భూమికి సంవత్సరానికి రూ. 16వేల పైచిలుకు ధరలు పలుకున్నాయి. నీ టి వసతులు తక్కువగా ఉన్నచోట రూ. 10వేల నుం చి 12వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నా రు. కొంతకాలంగా కౌలు రేట్లను పరిశీలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2010లో ఎకరాకు రూ. 3 వేలు ఉన్న కౌలు భూముల ధరలు, 2011లో రూ. 4 వేలు, 2012లో రూ. 5 వేలు, 2013లో రూ. 6వేలు, 2014లో 7వేలు, 2015లో 8వేలు, 2016లో 9 వేలు, 2017లో 10వేలు, 2018లో రూ. 12వేలు ఉండగా, 2019లో రూ. 13వేలు, 2020లో 14వేలు, 2021లో 14 వేలు, 2022లో రూ. 15వేలు ఉండగా 2023, ఆ త రువాత రూ. 16వేల పై చిలుకు కౌలు రేట్లు పెరిగా యి. పంట దిగుబడితో సంబంధం లేకుండా అగ్రి మెంటు ప్రకారం భూముల యజమానులకు కౌలు రైతులు పై రేట్లు చెల్లించాల్సి వస్తోంది.
పెట్టుబడులూ అధికమే...
పంటలు పండించేందుకు కౌలు రైతులు పెట్టే పె ట్టుబడులు సైతం అధికంగానే ఉంటున్నాయి. ఎకరా విస్త్రీర్ణం సాగు చేసేందుకు ఖర్చులు రూ. 25వేల వ రకు అవుతున్నాయి. ట్రాక్టర్ కిరాయి రూ. 7 వేలు వె చ్చించాల్సి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అ లాగే నాటు వేయడానికి రూ. 4 వేలు, ఎరువుల కో సం రూ. 8వేలు, కలుపు తొలగించేందుకు రూ. 3 వే లు, పంట సమయంలో కోత మెషీన్‌కు గంటన్నరకు రూ. 3000 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఎకరా సాగు చేసేందుకు రైతులు సగటున రూ. 25 వేలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుండటంతో కౌలు రైతు అ ధిక భారం మోయక తప్పడంలేదు. గత సంవత్సరం 6 వేలు ఉన్న ట్రాక్టర్ కిరాయి ఈ సంవత్సరం వెయ్యి రూపాయల వరకు పెరిగింది. అలాగే ఎరువుల ధర లు సరాసరి రూ. 2వేల వరకు పెరిగినట్లు రైతులు వాపోతున్నారు. 2017 వరకు జిల్లాలో 300 మంది కౌలు రైతులు ఉండగా 172 మందికి ప్రభుత్వపరం గా గుర్తింపు కార్డులు అందజేశారు. రూ. 3 లక్షల వ రకు రుణం మంజూరు చేశారు. అనంతరం కౌలు రై తు గుర్తింపు కార్డులను ప్రభుత్వం రద్దు చేయగా, బ్యాంకులు రుణాలు నిలిపి వేశాయి. దీంతో పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆ శ్రయించి, నిలువు దోపిడీకి గురవుతున్నారు.
చట్టాలు చచ్చు బండలు...
కౌలు రైతులకు సహాయ సహకారాలు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్ డ్ కల్టివేటర్స్ రూల్స్-2012 చట్టం అమల్లో ఉండేది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత చ ట్టం పూర్తిగా చచ్చుబడి పోయింది. 2016-17 వరకు చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత దా న్ని పట్టించుకోలేదు. చట్టంలో భాగంగా రెవెన్యూ అధికారులు కౌలు రైతులకు వ్యవసాయ సాగుకోసం గుర్తింపు కార్డులు అందజేసేవారు. గ్రామ పంచాయ తీ కార్యాలయాల వద్ద రైతుల వివరాలు నమోదై ఉండేవి. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు పొందేం దుకు అర్హత కార్డులు ఉండేవి. క్రాప్ లోన్ మినహాయించి ఇతరత్రా రుణాలు పొందేందుకు ఇవి ఉప యోగపడేవి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక రుణమాఫీ ప్రకటించి, రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏటా రూ. 8వేలు అందించినా... భూ యజమానికే తప్ప కౌలు రైతులకు ఎలాంటి ప్రయో జనం కలగలేదు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు స్పం దించి, తమనూ రైతు బంధు పథకం పరిధిలోకి తె చ్చి, పెట్టుబడి సాయం అందజేయాలని కౌలు రైతు లు విజ్ఞప్తి చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకో లేదు. ఆదుకుం టామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఆత్మహత్యలే శరణ్యమని...
అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 3వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ఇటీవలి కాలంలో బలవంతపు మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పంట దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఫకోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కౌలు రైతు కామ లింగయ్య (51) పత్తి పంట ప్రాణహిత వరదల్లో మునిగి నష్టం వాటిళ్లగా 2022 సెప్టెంబరు 20న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫభీమారం మండలం కొత్తపల్లికి చెందిన దుర్గం శ్రీనివాస్ (27) నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొ ని పత్తి సాగు చేయగా అధిక వర్షాల కారణంగా దిగుబడి రాక 2022 అక్టోబర్ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఫతాండూరు మండలం రేపల్లె వాడకు చెందిన పెద్దపల్లి లక్ష్మి (41) అనే కౌలు రైతు భార్య పంట దిగుబడి తగ్గి అదే సంవత్సరం నవంబరు 16న పు రుగుల మందు తాగగా 18న మృతి చెందింది. అలా గే అదే నెల 29న కాసిపేట మండలం కొండాపూర్‌కు చెందిన కొమిరె కనకయ్య (39) పంట దిగుబడి రాక బలవంతపు మరణానికి పాల్పడ్డాడు.
ఫలక్షెట్టిపేట మండలం చందారంలో పంట దిగు బడి రాక 2022 డిసెంబరు 11న పురుగుల మందు తాగి ఆకుల మల్లయ్య (45) అనే కౌలు రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఫకన్నెపల్లి మండలం జనకాపూర్‌కు చెందిన కౌ లు రైతు మేడి శ్రీనివాస్ (40) అదే నెల 12న తను వు చాలించాడు. ఇటీవల సైతం కౌలు రైతుల మర ణాలు ఉండగా, వాటిని సంబంధిత అధికారులు ధృవీకరించాల్సి ఉంది.