యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:25 PM
యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని తాండూర్ సీఐ కుమారస్వామి అన్నారు. సమాజంలో శాశ్వతంగా డ్రగ్స్‌ను నిర్మూలిం చేం దుకు, యువత డ్రగ్స్ వైపు దృష్టి సారించకుండా ఉండేం దుకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నా రు.
తాండూర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని తాండూర్ సీఐ కుమారస్వామి అన్నారు. సమాజంలో శాశ్వతంగా డ్రగ్స్‌ను నిర్మూలిం చేం దుకు, యువత డ్రగ్స్ వైపు దృష్టి సారించకుండా ఉండేం దుకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నా రు. శుక్రవారం తాండూర్‌లోని సీఐ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాండూ ర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో బెల్లంపల్లి సబ్ డివి జన్ స్ధాయిలో పెద్ద ఎత్తున కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిం చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి మండలానికి రెండు టీంలు పాల్గొనవచ్చని, మొత్తం 20 టీంలు పాల్గొంటా యన్నారు. ఈ నెల 25న టోర్నమెంట్‌ను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రారంభిస్తారన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస లు కావద్దని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలపై మక్కువ పెంచుకుంటే చెడు వ్యసనాల జోలికి వెళ్లరని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు కిరణ్‌కు మార్, సౌజన్య, గంగారాం పాల్గొన్నారు.