• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

కుప్పంలో క్యాంపు రాజకీయాలు!

కుప్పంలో క్యాంపు రాజకీయాలు!

వైసీపీనుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు కౌన్సిలర్లను కలుపుకుని అధికార పార్టీకి మొత్తం 10 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవితోపాటు కౌన్సిలర్‌ పదవికి కూడా డాక్టర్‌ సుధీర్‌ రాజీనామా చేశాక 16వ వార్డు ఖాళీగానే ఉంది. దీనికి ఇప్పట్లో ఎన్నికలు ప్రకటించక పోవడంతో ప్రస్తుతానికి 24 మంది మాత్రమే కౌన్సిల్‌లో ఉన్నారు. చైర్మన్‌ ఎన్నికల్లో ఈ 24 మందితోపాటు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భరత్‌లకు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఓటు కలిగి ఉంటారు. ఈ లెక్కన తీసుకుంటే ఈ ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులతోపాటు 24 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 27 మందికి మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఓటు హక్కు దఖలు పడుతుంది. కోరం ఉండాలంటే కనీసం 14 మంది సభ్యులు కౌన్సిల్‌ సమావేశానికి హాజరు కావాలి. ఇక్కడే అధికార టీడీపీ ప్రస్తుతానికి చిక్కులు ఎదుర్కొంటోంది.

ద్రావిడ వర్సిటీకి రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివి

ద్రావిడ వర్సిటీకి రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివి

ద్రావిడ విశ్వవిద్యాలయానికి తొలి రిజిస్ట్రార్‌గా పనిచేసిన పద్మశ్రీ రామకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివని ఇన్‌చార్జి వీసీ ఆచార్య దొరస్వామి తెలిపారు. గురువారం ద్రావిడ వర్సిటీలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట రామకృష్ణారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి ఇన్‌చార్జి వీసీతోపాటు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య కిరణ్‌ కుమార్‌, డీన్‌ ఆచార్య శ్యామల, అధ్యాపకులు, ఉద్యోగులు పూలమాల వేసి, నివాళి అర్పించారు. పలువురు ఉద్యోగులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పద్మశ్రీ అందుకున్న రైతుబిడ్డ

పద్మశ్రీ అందుకున్న రైతుబిడ్డ

హైదరాబాదులో బుధవారం కన్నుమూసిన వెదురుకుప్పం ప్రాంతానికి చెందిన భాషా శాస్త్రవేత్త పద్మశీ బండి రామకృష్ణారెడ్డి సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం తొలి రిజిస్ట్రార్‌గానూ చేసిన ఆచార్య బండి రామకృష్ణారెడ్డి(84) కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఆఖరి శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీలోని రెంటాలచేను. వీరిది వ్యవసాయ కుటుంబం. పల్లెలో ప్రాథమిక బడికూడా లేకపోవడంతో కాపుమొండివెంగనపల్లెలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వెదురుకుప్పంలో పదో తరగతి వరకు చదువుకున్నారు. కార్వేటినగరంలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో గణిత అధ్యాపకుడు కార్వేటినగరం నివాసి డాక్టర్‌ అరుణాలం ప్రోత్సాహం ఈయనకు దారి చూపింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి