Home » 2025
కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్‌కుమార్, నా యకులు షేక్ మహబూబ్‌బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చిన ఏడు వరాలపై మండలం లోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. వారు మంగళవారం ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండలంలోని పొడరాళ్లప ల్లి లో దాదాపు 50 ఏళ్లుగా భూమి కోసం జరుగుతున్న వివాదానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శాశ్వత పరిష్కారం చూ పారు. ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కొందరు దళితులు 51 సెంట్లలో గుడిసెలు వేసుకున్నారు. దీనిపై సుమారు 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇరు పక్షాల వారు కోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఆహర కమిషన సభ్యురాలు గంజిమాల దేవి సూచించారు. ఆమె మంగళవారం ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని తనిఖీ చేశారు. పాఠశాలలో నిత్యావసర వస్తువులను, ఆహార తయారీని, విద్యార్థులకు అందుతున్న మౌళిక వసతులను, వంటశాలను పరిశీలించారు.
ఒకప్పుడు దూప, దీప, నైవేద్యాలతో కలకలలాడిన ఆలయం నేడు పూజలు కరువై వెలవెలబోతోంది. కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. నల్లమాడ మండలం కురమాల గ్రామ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోంది. గతంలో ఆలయం నిత్యం భక్తులతో కలకలాడుతుండేది.
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్‌పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్‌పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు.
విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ట్ర యిల్ ఫోర్ కస్తూర్బా పాఠశాల(కేజీ బీవీ) సిబ్బందికి జీసీడీఓ అనిత సూచించారు. మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల వసతి గృహం లో విద్యార్థినులతో వంట పనులు, కూరగా యలు కోయడం, వాటర్ క్యానలు మోయించ డం వంటి పనులు చేయిస్తున్నారని, సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నా యని జీసీడీఓ అన్నారు.
సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చిత్రావతి సుందరీకరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటకనాగేపల్లి సత్యసాయి పార్క్ నుంచి దుర్గాదేవి ఆలయం వరకు దాతల సహకారంతో పూలమొక్కలను నాటారు. మొక్కలైతే నాటారు కాని వాటికి నీరు పోయడం మరిచిపోయారు. దీంతో ఆ మొక్కలు కాస్తా ఎండిపోతున్నాయి.