Home » ABN Andhrajyothy
స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ జీవితం గురించి చాలా మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి.. నేడు కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయనపై ప్రత్యేక కథనం మీకోసం...
కోల్‌కతా మెస్సీ రాకతో అల్లర్లు చెలరేగిన కారణంగా టూర్ నిర్వాహకుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మెస్సీని చూసేందుకు వేలకు వేలు వెచ్చించి టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకులకు ఆ సొమ్మును రీఫండ్ చేస్తారని అక్కడి ఏడీజీ తెలిపారు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్‌లో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో జరగబోయే మ్యాచ్.. ఫ్రెండ్లీగా మాత్రమే జరగనుందని శాట్స్ ఛైర్మన్ తెలిపారు. కోల్‌కతా లాంటి సంఘటనలు భాగ్యనగరంలో జరిగేందుకు అవకాశం లేదని ఆయన అన్నారు.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి నేడు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాడు. ఓ మహిళా అభిమాని మెస్సిని చూడటం కోసం తన హనీమూన్ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్‌కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.