Home » ABN
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన నేతలు బిజీగా ఉన్నారు. వారణాసి నుంచి మూడోసారి ప్రధాని మోదీ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. మోదీపై ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను శనివారం నాడు విడుదల చేసింది. వారణాసి నుంచి మరోసారి అజయ్ రాయ్ బరిలోకి దిగనున్నారు. అజయ్ రాయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అతని రాజకీయ నేపథ్యం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీతో కావడం విశేషం.
నిధి ఉందని నమ్మించారు. ఖజానాలో దొరికిన నగలను బంగారం అని వంచించారు. చివరకు ముగ్గురిని దారుణంగా హత్య చేసి కారులోనే నిప్పు పెట్టారు. కర్ణాటక ( Karnataka ) లోని తుమకూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కారులో కాలిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకోగా, వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పినప్పటికీ వ్యాపారి రవి వినిపించుకోలేదు. దాడి చేశాడు.
దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్కు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోాలీ పండగ సందర్భంగా సైనికులను కలుస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
మీలో ఎంతమంది పులిని దగ్గర నుంచి చూశారు. సింహ గర్జనను ఎంత మంది విన్నారు. నెమలి నాట్యాన్ని ఎంత వరకు చూశారు.. ఇలా మనం చేయని పనులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ఫారెస్ట్ అధికారులు జంగిల్ సఫారీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానంలో బ్యాంకుల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నగదును బీజేపీ స్వీకరించిందని పేర్కొంది.