Home » ABN
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రాందాస్ అథవాలే కారు గురువారం నాడు ప్రమాదానికి గురయ్యింది. సాతారా జిల్లా వాయ్ వద్ద ప్రమాదం జరిగింది. కంటైనర్ బ్రేకులు వేయడంతో అథవాలే కారు ఢీ కొందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. లోక్ సభ ఎన్నికల్లో షిరిడీ లేదంటే షోలాపూర్ నుంచి బరిలోకి దిగుతానని ఇటీవల రాందాస్ అథవాలే స్పష్టం చేశారు.
విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. బెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మెదడులో రక్త స్రావం ఎందుకు జరుగుతుందనే అంశాన్ని డాకర్ట్ వినిత్ సూరి వివరించారు. ‘తీవ్రమైన తలనొప్పి ఉంటే చెక్ చేయించుకోవాలి. ఒక్కసారిగా బలహీనంగా అవడం. తిమ్మిరి రావడం. మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం. కంటి చూపు సమస్య ఏర్పడటం. అర్థం చేసుకోకపోవడం, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అని’ డాక్టర్ వినిత్ సూరి వివరించారు. ఇందులో ఏ లక్షణం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు ( Maoist ) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. మార్చి 19 కోళ్లమర్క అడవిలో జరిగిన కాల్పులను బూటక ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించింది.
కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు.
మొబైల్ యూజర్లకు వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.
సాధారణంగా సినిమాల్లో విలన్ లేదా చీటర్ ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక సరిగ్గా తాళి కట్టే సమయంలో పోలీసులు ఎంటరై పెళ్లిని ఆపేస్తారు.