Home » ABN
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అసెంబ్లీ ఎన్నికలు మండు వేసవిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓ వైపు, వైసీపీ మరో వైపు తాడో పేడో తేల్చుకునేందురు రెడీ అవుతున్నాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి కాఫీ. చాలా మంది ప్రజలు తమ రోజును వేడి వేడి కాఫీతో ప్రారంభించడాన్ని ఇష్టపడుతుంటారు. అద్భుతమైన రుచి, సువాసన కలిగి ఉండే కాఫీ.. బరువు తగ్గించడంలో సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా..
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
హర్యానాలో ( Haryana ) ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉగాది.. ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. దేశాన్ని దోచుకునే లైసెన్సు తమకు ఉందని కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆరోపించారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.