Home » ACB
జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.
నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీ చిక్కిన నిఖేష్ కుమార్.. రోజుకు రూ. 2 లక్షలకుపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నిఖేష్ కుమార్‌తోపాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17 కోట్ల 73 లక్షల అక్రమాస్తులు వెలుగుచూశాయి.
ఇటీవలే చనిపోయిన విశ్రాంత ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ డబ్బులను ఆయన భార్యకు ఇప్పించేందుకు రూ.40వేలు లంచం అడిగిన సీనియర్ అకౌంటెంట్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రవాణా శాఖ చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని మూడు వేర్వేరు చెక్పోస్టులపై ఏసీబీ ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
సస్పెండ్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు సోదాలు చేస్తు్న్న సమయంలో నికేష్ ఇంట్లో హైడ్రామా నడిచింది. ఏసీబీ అధికారులను గమనించిన ఏఈఈ దస్త్రాలను మూటగట్టి బాల్కానీలో నుంచి బయటకు విసిరేసారు.
సింగిల్ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.
వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా విశాఖపట్నం మహానగరం రూపాంతరం చెందింది. అలాంటి ఈ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది.