Home » Accident
సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు విన్యాసాలు చేస్తూ తెలిసి ప్రమాదానికి గురైతే.. మరికొందరు ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే తాజాగా, ప్రమాద సమయంలో విచిత్రంగా ప్రవర్తించిన వ్యక్తికి సంబంధించిన వీడియో..
తిరుపతిలో మంగళవారం ఉదయం బుల్డోజర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.
గౌలిదొడ్డి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారు. కొందరు యువతులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రీల్స్ పిచ్చిలో యువకులతో పోటీ పడి మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి..
రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు సీఎం భజన్ లాల్ కాన్వాయ్లోని ఓ కారును ఢీకొట్టింది. జైపూర్లోని జగత్పురా ఎన్ఆర్ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలను చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటూ అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా..
చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు 46మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరింది.
రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది.
గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.