Home » Adilabad
మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు, చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు.
చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్ కాలనీలోని సేవా భవన్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
మండలంలోని సూపాక గ్రామంలో శుక్రవారం మారమ్మ జాతర ప్రారంభమైంది. మారమ్మ, లక్ష్మీదేవి విగ్రహాలను గ్రామస్థులు పల్లకిలో చెన్నూరు గోదావరి నదికి కాలినడకన చేరు కున్నారు.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కామన్ మెనూ ఎంత ఇవ్వాలనే అంశాన్ని విస్మరించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్ చార్జీలను, 200 శాతం వరకు కాస్మొటిక్ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.
కొన్నేళ్ళుగా పని చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టాలన్నా విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెబ్బులి హడలెత్తిస్తోంది. పాత మంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్‌లోని అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు, అడవిలోకి వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్ వైర్లు అమర్చకూడదని సూచించారు.
అమృత్ 2.0 పథకంతో జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు చేపట్టిన ఏరియల్ సర్వేను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధికి డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టినట్లు చెప్పారు.
సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గురువారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. యూనియన్ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రఫీయాలు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.
మంచి ర్యాల పట్టణానికి ఇకమీదట వరద ముప్పు తప్పనుంది. యేటా వర్షాకాలంలో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్ల వాగు వరదలను నివారించేందుకు కరకట్టలు నిర్మించా లని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాగుకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ (అడ్డుగోడ) నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా బుధవారం అధికారులు రాళ్లవాగులో సర్వే జరిపారు.