Home » Afghanistan
IPL 2024: ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనడం అనుమానంగా మారింది. పేసర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్లా ఫరూఖీ, ముజీబుర్ రెహ్మాన్‌లు ఐపీఎల్లో పాల్గొనేందుకు వచ్చే రెండేళ్ల పాటు ఎన్వోసీ ఇవ్వకూడదని ఆప్ఘనిస్తాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ODI World Cup 2023: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడ్ని డేంజరస్ ఆటగాడిగా పరిగణిస్తుంటారు. అలా ఎందుకంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది. త్వరగా వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు..
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొని నిర్ణీత ఓవర్లు ఆడటంతో పాటు 5 వికెట్ల నష్టానికి 291 పరుగుల స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ సాధించడమే కాకుండా అజేయుడిగా నిలిచాడు.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే.
లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.
2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విక్టరీ సాధించడం తమకు ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని రషీద్ చెప్పుకొచ్చాడు.