Home » AIADMK
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు.
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెచ్చిన పెట్టుబడుల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తిరునల్వేలి సభలో మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి.
అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పర్యటించారు.
డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్ వాకింగ్‌కు వెళ్తుండగా ఓపీఎస్ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.
రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిన అన్నాడీఎంకే పథకాలను అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు.
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల కారణంగా ఇప్పటివరకు 20 పరువు హత్యలు జరిగాయని, ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.
నిన్నటి వరకూ బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి, అది కుదరక తీవ్ర మనస్తాపంతో వున్న మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృతనేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) తాజాగా తన అక్కసు వెళ్లగక్కారు.