Home » Airport
రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
విమానాశ్రయంలో రేడియా ధార్మిక పదార్ధాల గుర్తింపు ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. లక్నోలోని చౌధరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 కార్గో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రొటీన్ తనిఖీల సమయంలో రేడియా ధార్మిక పదార్ధాలను అధికారులు గుర్తించారు.
ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు.
జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.
సలీం గోలేఖాన్, నసీరుద్దీన్ ఖాన్‌గా వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లతో పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారన్నారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అప్రమత్తమై భద్రత సిబ్బంది... వారిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Kempegowda International Airport) ఏడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్, ఫుడ్, బెవరేజ్‌తోపాటు హాస్పిటాలిటీ కాన్ఫరెన్స్ తదితర విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్ కల్చర్ వీక్ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీని కారణంగా స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.