Home » Amaravati
‘దసరా’, ‘దీపావళి’ పండగలని తెలుసు. దేశవ్యాప్తంగా కొన్ని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నట్టే... ఆశ్చర్యంగా ఒక ఊరి పేరు ‘దీపావళి’. అది కూడా ఎక్కడో కాదు... మన దగ్గరే. దేశవ్యాప్తంగా ఈ పేరుతో ఉన్న ఒకే ఒక్క ఊరు అది... ఇంతకీ ఎక్కడుంది? ఏమా కథ??
అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.
నగరంలోని క్లాక్ టవర్ ఫ్రైఓవర్ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్ వలి(32)దుర్మరణం చెందాడు.
మద్యం ఫుల్‌గా తాగిన ఓ మందుబాబు జిల్లా కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ప్రశాంతిగ్రామ్‌లో ఓ యువకుడు మద్యం పుల్గా సేవించి కదులుతున్న కారుటా్‌పపై పడుకుని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.
డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్ఎం గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు.
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.