Home » Amaravati
ముంబై నటి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందన్నారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల లెక్కలన్నీ బయటపెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్రమాలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి లోకేష్..
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2014-19మధ్య గత టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నాశనం చేసి కూర్చుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాకా గానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు...
ఈ నెల 4న ‘లేటరైట్ రైట్..’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం 2022 బ్యాచ్‌కు చెందిన 8మంది అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులూ పాత్రధారులేనని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆరోపించారు.