Home » Amaravati
రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
సెల్‌ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరికి వేలాడిన తల్లి మృతిచెంది ఉండగా మూడేళ్ల సహర్షను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల సేకరణ కాదు.. రామకోటి రాస్తే మేలు.. అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఎద్దేదా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనో భావాలని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడో దుర్మార్గుడు. పసివాడిని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ప్రేమ నటించి, మేనల్లుడు ఐదు సంవత్సాల హర్షవర్ధన్‌ను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.
ఒకటి నీకు.. మరొకటి నాకు అన్నట్లుగా తిరుపతిలోని రాజకీయ పార్టీల నేతలు ఒక్కటైపోయారు. సిండికేట్ గా మారి షాపులను పంచుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభను చాటాడు.
తగిన ఆధారాలు చూపించి పాపను తీసుకెళ్లాలని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని కోరారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.