Home » Amaravati
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
‘మీ దగ్గర పనిచేసే సర్వేయరే నా స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టేసుకున్నాడు. తహసీల్దారు(Tehsildar) కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడంలేదు. మీరైనా సర్వే చేయించి న్యాయం చేయండి’ అంటూ ఆర్డీవో రామ్మోహన్(RDO Rammohan) ముందు ఓ బాధితుడు ఆవేదన చెందారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ హయాంలో అడ్డగోలుగా టెండర్లు దక్కించుకున్న అరబిందో సంస్థ 108, 104, 102 ఉద్యోగులకు నరకం చూపించింది. ఈ మూడు పథకాల కింద వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేసింది.
Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..
రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. కూటమి ప్రభుత్వంలో పనులు అనతికాలంలోనే వేగం పుంజుకున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రభుత్వ భవనాల నిర్మాణం సాగుతుండగా, వివిధ శాఖలు, కేంద్ర సంస్థలు కూడా తమ పనులు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి. కోర్ క్యాపిటల్‌లోని ప్రభుత్వ కార్యాలయ, సిబ్బంది నివాస భవనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్‌కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివాహమైందనే కారణంతో కారుణ్య నియామకం కింద చనిపోయిన ఉద్యోగి స్థానంలో కుమార్తెకు దేవదాయశాఖ అధికారులు ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.
ప్రజలను ఏమార్చి, బ్యాగుల్లోని బంగారు నగలు, సెల్ఫోన్లు అపహరించే ఇద్దరు నిందితులను తిరుపతి క్రైం పోలీసులు(Tirupati Crime Police) అరెస్టు చేశారు. డీఎస్పీ రమణకుమార్ తెలిపిన ప్రకారం.. కృష్ణా జిల్లా గుడివాడ(Krishna District Gudivada) మండలానికి చెందిన వేముల శివకుమార్ వృత్తి రీత్యా తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద ఉంటున్నాడు.