Home » Amaravati
టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్‌ల్లో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ,లు మంగళవారం టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతి(Tirupati)లోని టీటీడీ పరిపాలన భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఏళ్ల గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవంతో శింగనమల శ్రీరంగరాయలచెరువు(Shinganamala Srirangarayalacheruvu) కింద కాలువలు ధ్వంసమయ్యాయి. కాలువల పొడువునా కంపచెట్లు, జనుము పెరిగిపోయింది. జిల్లాలో అతిపెద్ద చెరువుగా ఉన్న శ్రీరంగరాయలచెరువు కింద 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ భూమికి నాలుగు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతుంది.
సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి(Kanipakam Varasiddhi Vinayaka Swamy) ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్‌ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్‌పై లాయర్ రవికుమార్ ఆరునెలల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
దీపావళి పండుగ(Diwali festival) పూల రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.రెండు రోజులుగా పూల ధరలకు రెక్కలు వచ్చాయి. సోమవారం వి.కోట పూల మార్కెట్లో కిలో బంతి పూలు గరిష్టంగా రూ. 40 వరకు పలకగా, కిలో చామంతి పూలు అత్యధికంగా రూ. 150 వరకు పలికాయి. బటన్ రోస్ కిలో రూ. 200 పలికింది. వి.కోటలో పూల వ్యాపారుల మధ్య పోటీ తలెత్తడంతో ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏడుగురు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్ళు, జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ దశలో మంజూరైన 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ను బదిలీ చేయాలని నిర్ణయించింది.
మండలకేంద్రంలో ఈ నెల 23వ తేదీన లక్ష్మీనారాయణ(Lakshminarayana)ను హత్య చేసిన కేసులో కార్తీక్ అనే యువకున్ని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ అరెస్టు వివరాలను వెల్లడించారు. ఇక్కడి వెంగమనాయుడు కాలనీ(Vengamanaidu Colony)లో నివాసం ఉండే లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు ఉన్నారు.
అశ్విని వైస్తాన్, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందరూ రూ. 2,245 కోట్ల నిధులతో ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్లు మేరకు అమరావతి ప్రత్యేక రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసిన అంశాన్ని ప్రకటించటం సంతోషంగా వుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ దాన.. శుక్రవారం తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి.
రాష్ట్ర రహదారులను పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయడానికి కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.