Home » Amaravati
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, భూసేకరణ, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
రాజధాని రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు.
అమరావతిలో రైలు మార్గానికి తొలి అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని ప్రకటించింది. ఎరుబాలెం నుంచి అమరావతి మీదగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టునుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు మెట్రో నగరాలను కలుపుతూ ఈ రైల్వే నిర్మాణం జరగనుంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపులకు రాష్ట్రంతోపాటు, రాజధాని అమరావతి బలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి పునర్వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలను, మెట్రో నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అంగీకరించింది.