Home » America
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారన్నారు. కాళేశ్వరం, ఈ కార్, ఇలా అన్నింటా స్కామ్ చేసి పార్టీ ఫండ్‌ను కూడబెట్టుకున్నారని మైనంపల్లి అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
భారత్‌పై భారీగా సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలతో భారత్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా కాంగ్రెస్ నాయకులు మాత్రం భారత్‌తో బలమైన బంధాలను కోరుకుంటున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోందని మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. అధ్యక్షుడికి చెక్ పెట్టే విషయంలో అమెరికా చట్టసభలు కూడా విఫలమయ్యాయని అన్నారు.
హెచ్-1బీ వీసాల విషయంలో నిబంధనల్ని కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. కంటెంట్ మోడరేటర్లు, ఫ్యాక్ట్ చెకర్ల వంటి వీసా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని, సెన్సార్ అనుమానమున్న దరఖాస్తులను తిరస్కరించాలని అక్కడి రాయబార కార్యాలయ అధికారులకు మెమో జారీచేసింది.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకలైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు.
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం బుధవారం కాలిఫోర్నియాలో కూలిపోయింది. అయితే, పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.