Home » America
అమెరికా ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ప్రజలకు గూగుల్ విశ్వసనీయ సమాచార కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిలషించారు.
ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరిగితే ఫలితమేదైనా తాను ఆమోదిస్తానని అన్నారు. ఓటమిని అంగీకరిస్తానని స్పష్టం చేశారు.
US Elections 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం (నవంబర్ 05, 2024) ఓటింగ్ జరగనుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అనేక దశల్లో ఓటింగ్ జరుగుతుంది. కానీ, అమెరికాలో మాత్రం ఒకే రోజు జరుగుతుంది. అవును, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు మాత్రమే ఓటింగ్ ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్ సమయం వచ్చేసింది. ఇవాళ (మంగళవారం) దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రాజకీయం చేస్తే.. అది అడ్డం తిరిగి మరో వర్గం మొత్తానికే దూరమై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు రుజువు కాబోతోందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది!
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన కాంటన్ హిందూ టెంపుల్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేశారు. పోలింగ్‌కు మరొక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది. ఈ సర్వేలో మొగ్గు ఎవరివైపు ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏయే రాష్ట్రాలు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే విడుదలైంది. డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు పెద్దగా దృష్టిపెట్టని అయోవా (Iowa ) రాష్ట్రం స్వింగ్ స్టే్ట్‌గా మారే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ‘డెస్ మోయిన్స్ రిజిస్టర్’ అనే వార్త పత్రిక సర్వే పేర్కొంది.
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ స్వింగ్ రాష్ట్రాలు-- విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా తరలించింది.