Home » Amit Shah
ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.
కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కెనడాలో ఖలిస్థానీలపై దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ట్రూడో ప్రభుత్వం తాజాగా ఆరోపించింది.
బెంగాల్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులను టీఎంసీ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రోపించారు. గత పదేళ్ల ఎన్డీయే హయాంలో బెంగాల్‌కు రూ.56,000 కోట్లు ఇచ్చిందన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గోనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.
దేశంలో గత పదేళ్లుగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉగ్రవాదంపై పోరును ఆపబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు.