Home » Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.
జమ్మూ కశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టే నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి సీనియర్ నేత జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందిస్తూ జగ్‌దీప్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు మినహా ఇతర అంశాలేవీ లేవని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే చోదక శక్తి పార్లమెంటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చట్ట సభలో రూపుదిద్దుకునే సరైన విధానాలే మన దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.
స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా..
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ..
డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని బి సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్యనే పోటీ అని చెప్పారు.