Home » Anantapur urban
పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చట్టాలపై అవగాహన కలి గి ఉంటే సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి శివప్రసాద్‌యాదవ్ అన్నారు.
హంద్రీనీవా ప్ర ధాన కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసులు అన్నా రు. స్థానిక సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1988లో ప్రారంభమైన ప్రాజెక్టు 35 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం దారుణమన్నారు.
బీజేపీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి కృష్ణమూర్తి హత్యకు వైసీపీ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. రోడ్లు, భవనాల అతిథిగృహంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణమూర్తి హత్యకు దారితీసిన కారణాలను సందిరెడ్డి వివరించారు.
ప్రజారోగ్యం కోసం నిరంతరం కేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టరు గేయానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ కంకణం కట్టుకున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని అన్నారు.
స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా అర్బన బ్యాంకు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ నాయకత్వంలోని జట్టు మొదట బ్యాటింగ్ చేయగా.... 15 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్, నెట్‌బాల్, బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్‌రెడ్డి తెలిపారు. బేస్‌బాల్ అండర్-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సం బంధించిన అపార్ జనరేషన పక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టా లని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం అ పార్పై సమీక్షించారు. జిల్లా లో ప్రతిరోజు 10వేల నుంచి 15వేల వరకు అపార్ జనరేషన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.