Home » Anantapur urban
మండల కేంద్రంలోని ఆర్డీటీ గ్రౌండు ముందు ప్రధాన రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని తొలగించాలని సీపీఐ మండల నాయకులు మంగళవారం వినూత్న రీతిలో ధర్నా చేశారు.
జాతీయ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ విజేతగా మణిపూర్ జట్టు నిలిచింది. 20 రోజులుగా స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీలో నిర్వహిస్తున్న జాతీయ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలు మంగళవారం ముగిశాయి.
ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక 21వ డివిజన 33వ సచివాలయం పరిధిలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం చేసిన నరహంతకులను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లాకేంద్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగించారు. జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం వందలాదిమంది పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ హిందువులకు దేశ ప్రజలు అండగా నిలవాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ హిందువులపై జరుగుతున్న దారుణాలపై శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ నిర్వహించా రు.
2023 సంవత్సరానికి సంబంధించి పంటల బీమాను వెంటనే ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మండలంలోని కక్కలపల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయమైపోయింది. దీంతో ఆ రోడ్డు గుండా ప్రయాణం సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఏఐఎ్‌సబీ, వీఎనఐవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలువురు జూనియర్ వైద్యులు, విద్యార్థులు టవర్‌క్లాక్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వైద్యురాలిని అత్యాచారం చేసి, హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీపీఐ, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు.
శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో వ్రతాలను ఆచరించారు.