Home » Anantapur urban
సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్రావు పేర్కొన్నారు.
సంతోష్ ట్రోఫీ-2024 ఫుట్‌బాల్ పోటీలు ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలిండియా ఫుట్‌బాల్ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్ ఛౌబే, జేసీ శివ నారాయణశర్మ, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఈ పోటీలను ప్రారంభించారు.
ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన ఏర్పాటు చేసి తక్షణమే చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణకు కోర్టులో కేసువేసి గెలిచిన సభ్యులకు శుక్రవారం సత్కార మహాసభను నిర్వహించారు.
విద్యుత పొదుపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని విద్యుత శాఖ ఎస్ఈ సంపతకుమార్ పేర్కొ న్నారు. గురువారం జేఎనటీయూ రోడ్డులోని విద్యుత శాఖ ప్రధాన కార్యాల యంలో ఉర్జావీర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార వ్యవస్థకు జవసత్వాలు నింపుతున్నాయని... దీంతో సొసైటీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయని ది అనంతపురం కోఆపరేటివ్ అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ పేర్కొన్నారు. స్థానిక సుభాష్ రోడ్డు లోని శ్రీకృష్ణదేవరాయభవనలో గురువారం ఆయన సహకార జెండాను ఆవిష్కరించి, 71వ అఖిల భారత జాతీయ సహకార వారోత్సవాలను ప్రారంభించారు.
ఇంటింటి జియోట్యాగింగ్ ప్రగతిపై డీపీఓ నాగరాజ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలో తనిఖీ చేశారు.
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఎస్పీ జగదీష్ దంపతులు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ కాన్ఫరెన్స రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల మధ్య ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు.
ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించే అహుడా సంస్థ అభివృద్ధిలో తమ అధినేత పవనకల్యాణ్ మార్క్ ఏంటో చూపుతామని అహుడా చైర్మన, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అన్నారు.
మండలకేంద్రంలో బుధవా రం స్థానిక వాల్మీకుల ఆ ధ్వర్యంలోవాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠను ఘనం గా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.