Home » Anantapur
ఇన సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మ హేశకు వినతిపత్రం అందజేశారు.
సత్య సా యి బాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్లిఓ జ రిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదుచేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు.
కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు.
కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు.
కూటమి ప్రభుత్వంపై అవా కులు, చవాకులు పేలితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని వైసీపీ ఇనచార్జ్ మగ్బూల్ బాషాపై టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలుగుయువత మండలాధ్యక్షుడు కావడి ప్రవీణ్‌కుమార్, నా యకులు షేక్ మహబూబ్‌బాషా, పులికంటి నరసింహులు తదితరులు మంగళవారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిం చిన ఏడు వరాలపై మండలం లోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. వారు మంగళవారం ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండలంలోని పొడరాళ్లప ల్లి లో దాదాపు 50 ఏళ్లుగా భూమి కోసం జరుగుతున్న వివాదానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శాశ్వత పరిష్కారం చూ పారు. ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కొందరు దళితులు 51 సెంట్లలో గుడిసెలు వేసుకున్నారు. దీనిపై సుమారు 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇరు పక్షాల వారు కోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఆహర కమిషన సభ్యురాలు గంజిమాల దేవి సూచించారు. ఆమె మంగళవారం ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని తనిఖీ చేశారు. పాఠశాలలో నిత్యావసర వస్తువులను, ఆహార తయారీని, విద్యార్థులకు అందుతున్న మౌళిక వసతులను, వంటశాలను పరిశీలించారు.
ఒకప్పుడు దూప, దీప, నైవేద్యాలతో కలకలలాడిన ఆలయం నేడు పూజలు కరువై వెలవెలబోతోంది. కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. నల్లమాడ మండలం కురమాల గ్రామ సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోంది. గతంలో ఆలయం నిత్యం భక్తులతో కలకలాడుతుండేది.