Home » Anantapur
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రానున్న దసరా పండుగ లోగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించా లని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులి వ్వాలనే పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల తో కలిసి బుధవారం స్థానిక క్లాక్‌టవర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యా లీ నిర్వహించారు.
నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహాల గేటు ప్రాంతం వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. సమీపంలో ఆస్ప త్రులు, కాంపౌండ్‌కు ఆనుకొని టీస్టాల్ ఉండటంతో అక్కడికొచ్చే వారు తమ వాహనాలను తీసుకొచ్చి హాస్టల్ గేటు ఎదుట నిలిపి వె ళ్తున్నారు. దీంతో హాస్టల్లోకి వెళ్లేందుకు... బయటికి వచ్చేందుకు విద్యా ర్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
టెక్నికల్ ఎడ్యుకేషనకు మౌలిక సదుపాయాలు కల్పించిన జేఎనటీయూ ఈ ప్రాంత విద్యార్థులకు వరమని కియ ప్రతినిధులు ప్రశంసించారు. ఇనచార్జి వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు ఆధ్వర్యంలో కియ ప్రతినిధులు హాంగ్సంగ్ పార్క్, హంగు కిమ్, శ్రీహాసన వర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలను బుధవారం సందర్శించారు.
కణేకల్లు మండలం హననకనహాళ్ గ్రామంలో రాములోరి రథానికి నిప్పంటించిన ఘటనలో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ జగదీష్ బుధవారం విలేకరులకు తెలిపారు. రాములోరి రథాన్ని 2022లో అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20లక్షలు వెచ్చించి తయారు చేయించారని అన్నారు.
రాముల వారి రథం దహనం వెనుక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి పాత్ర ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రథం దహనం కేసులో వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశఽ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షణీయమని అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని ముట్టాల గ్రా మంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందిపంటలో డ్రోన ద్వారా మందు పిరికారి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలు సం క్షేమమే ఽధ్వేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండలంలోని లోలూరులో మంగళ వారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.
మాది మాటల ప్రభు త్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక లక్ష్మీనగర్‌లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి సంబంధిత కరప త్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
విద్యార్థులను దేశసేవలో భాగ స్వామ్యం చేయడమే జాతీయ సేవా పథకం(ఎనఎస్‌ఎస్) ఏర్పాటు లక్ష్యమని సెంట్రల్ యూనివర్సీటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి పేర్కొన్నారు. ఎనఎస్‌ఎస్ డేను పురష్కరించుకుని జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మంగళ వారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.