Home » Anantapur
నియో జకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారిం ది. వాటిని గురించి పట్టించుకొనే వారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చెరువుల కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయి వాటి భద్రత దెబ్బతింటోంది. గత ఐదేళ్లుగా వీటి బాగోగులు గురించి పట్టించుకొనే అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు కరువయ్యారు.
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నా యకులు సంస్థ జోనల్ చైర్మన పూల నాగ రాజును కలిసి సమస్యలు విన్నవించారు. అనంతపురానికి శనివారం వచ్చిన జోనల్ చైర్మనను ఆయన చాంబర్లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన జి ల్లా అధ్యక్షుడు సూరిబాబు, డిపో కార్యదర్శి రామాంజనే యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతపురం డీఎం కార్యాలయం శిథిలా వస్థకు చేరుకుందని, నూతన భవనం ఏర్పా టుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన నాయకులు పాల్గొన్నారు.
ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు.
మం డలంలో చెదరుమదురు సంఘటనలు మినహా సాగు నీటి సంఘం, మైనర్ఇరిగేషన, హెచ్చెల్సీ డిస్ర్టిబ్యూటరీ సంఘాల చైర్మన్ల ఎన్నికలు ప్ర శాంతంగా జరిగాయి. అన్నింటికి టీడీపీ మద్దతు దారులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. హెచ్చె ల్సీ ఆయకట్లు కింద ఉన్న పొడరాళ్ల సంఘం చైర్మనగా పామురాయి రామ్మెహన, జంతు లూ రుకు సూర్యప్రకాష్రెడ్డి, కొర్రపాడుకు రాచమల్ల సోముశేఖర్, చెన్నంపల్లికి ఆలం నాగార్జన ఏకగీవ్రమయ్యారు.
గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ... చిన్నారులకు ప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు అర్థంతరంగానే నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు కాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపి వేశా రు.
మార్గశిర శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో పుష్పాభిషేకాన్ని వై భవంగా నిర్వహించారు. బాబా మూలవిరాట్ను విశేషంగా అలంకంకరిం చి, వివిధ రకాల పూలతో అభిషేకించారు.
జేఎనటీయూ విద్యార్థులకు అత్యధిక వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తున్నా మని ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను గురువారం వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్ క్రిష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ దేవన్న అభినం దించారు.
రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
వివిధ రకాల ప్రజా సేవలతో ముడిపడి ఉన్న తహసీ ల్దార్ కార్యాలయాలు అధికారుల కొరతతో కొట్టుమిట్టా డుతున్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం ఆ కార్యా లయాలకు వచ్చే ప్రజలు నిస్సహాయ స్థితిలో ఇబ్బం దులు పడుతున్నారు. సకాలంలో పనులు జరగడం లేదని నిట్టూర్పు విడుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పరిస్థితి కనిపి స్తోంది. రూరల్, అర్బన తహసీల్దార్ కార్యాలయాల్లో పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా శబరిమల(Shabari mala)కు సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కొల్లాం(Guntur-Kollam) ప్రత్యేక రైలు (నం. 07181) జనవరి 4, 11, 18 తేదీల్లో రాత్రి 11-45 గంటలకు గుంటూరులో బయలుదేరి 6, 13, 20 తేదీల్లో ఉదయం 6-20 గంటలకు కొల్లాంకు చేరుకుంటుందన్నారు.