Home » Anantapur
వైసీపీ నాయకుల ఒత్తిడితో మండలంలో అధికారులు ఇష్టారాజ్యంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో గత టీడిపీ పాలనలో 400 ఉన్న దివ్యాంగుల పింఛన్ల సంఖ్య 1200కి పెరిగింది. ఇందులో అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ..
అనంతపురం(Anantapur) నగర శివారుల్లోని టీవీ టవర్ సమీపంలో ఓ మందుబాబు నాగుపాముతో ఆటలాడుతూ హల్చల్ చేశాడు. కదిరి-అనంతపురం(Kadiri-Ananthapuram) హైవే పక్కన కూర్చొని పామును చేతిలో పట్టుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో ఉందని రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి(Vijaya Pratap Reddy) ప్రశంసించారు. ఆయన మంగళవారం తాడిపత్రి, మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు.
ఊరికి అగ్నిమూలన శ్మశానం ఉందని, మరోచోట స్థలం కేటాయించాలని కామారుపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. మండలపరిధిలోని కామరుపల్లిలో తహసీల్దార్ మోహనకుమార్ అధ్యక్షతన మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ కేశవనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలోని పలు సమస్యల ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన నియోజక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నా యకులు మంజునాథ్, దాదాపీర్ మన టీడీపీ యాప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ వారికి అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్శర్మ తెలిపారు. మండల పరిధి లోని కేశవాపురంలో మంగళవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభి వృద్ధి కుంటుపడింది. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో వీదిలైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి కనీస వ సతులను కల్పించలేదు. దీంతో గ్రామ వీధులు మురు గునీరు, వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారా యి. వాటిపై సంచారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా రు. అయితే కూట మి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి న ఆరు నెలల్లోనే వివిధ రకాల అభివృద్ధి పనులు జరు గుతున్నాయి.
గత వైసీపీ హయాంలో శోత్రియం భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేసిన వైసీపీ(YCP) నాయకుడు.. తాజాగా సర్వే చేసేందుకెళ్లిన అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. తన అనుచరులను ఉసిగొల్పాడు. పెనుకొండ మండలం బొజ్జిరెడ్డిపల్లి(Bojjireddypalli)లో సర్వే నంబరు 28/2లో 28సెంట్ల శోత్రియం భూమి ఉంది.
జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని అనంతపురం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న అనంతపురానికి చెందిన నలుగురు నిందితులు అబుసలేహ, దస్తగిరి హుసేన్, కిశోర్, వాచ్మెన్ ఆనంద్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్ సెంటర్లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.