Home » Anantapur
అర్బన నియోజకవర్గంలో పేదల సభ్యత్వ నమోదు కోసం పలువురు విరాళాలు అందించారు. అనంత పురంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో సోమవా రం మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి రూ. లక్ష, 9వ డివిజన నాయకుడు సాకే రామాంజినేయులు రూ. 50 వేలను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోం దని, ఆర్నెల్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్ కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొ న్నారు. ఆమె సోమవారం మండలపరిధిలోని కుంటిమద్ది గ్రామంలో రూ. 36.50 లక్షల వ్యయంతో ఎనఆర్‌జీఎస్ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను స్థానిక టీడీపీ నాయకు లు, అధికారులతో కలిసి పరిశీలించారు.
నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగించే మండలం లోని పలు రహదారులు ప్రయాణికుల పట్ల ప్రమాద కరంగా మారాయి. సైడ్‌వాల్‌లు లేని బ్రిడ్జిల వద్ద వాహనచోదకులు ఏ మాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు అధికారులు...అటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అనంతపురం తీసుకొచ్చారు.
గీతాజయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలకు విశేష స్పందన లభించింది. ఆరు నుంచి 9వ తరగతి వరకు రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు వందమంది విద్యార్థులు పాల్గొని భగవద్గీత పఠనం చేశారు.
ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో ఆర్ట్స్ కళాశాల వి ద్యార్థులు ఆసాధారణ ప్రతిభ కనబరిచారు. మహిళా విభాగంలో 62, పురుషల విభాగంలో 64 ప్రకారం మొత్తం 127 పాయింట్లతో ఓరాల్ చాం పియన్లుగా నిలిచారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజులు గా నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్ చాంపియన షిప్-2024 పోటీలు ఆదివారం ముగిశాయి.
ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేసేది, దేశం లో ప్రజలకు కష్టం వస్తే అండగా నిలిచేది కమ్యూని స్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాం భూపాల్ పేర్కొన్నారు. స్థానిక గణేనాయక్ భవనలో ఆదివారం నిర్వహించిన సీపీఎం నగర ఎనిమిదో మహాసభలో రాంభూపాల్ ప్రసంగించారు. పాలకులు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు వెంటనే చూసేది కమ్యూనిస్టుల వైపే అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ప్రజాసమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని, అందుకే ప్రజలు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టు నాయకులవైపు చూస్తారన్నారు.
మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. కోర్టు అనుమతితో అనిల్‌ను అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.
మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు.