Home » Ananthapuram
అనంత పురం రూరల్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ టీచర్ కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సాయినగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి మూడు రోజుల కిందట తీసుకొచ్చారు. ఇక్కడ ఆ అబ్బాయిని పరీక్షించిన డాక్టర్ ఇది డెంగీ ఫీవర్లా ఉంది. ప్లేట్లెట్స్ తగ్గాయి. ఇక్కడే అడ్మిషన చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ టీచర్ ఆందోళనతో డాక్టర్ చెప్పినట్లు చేశాడు. ప్రతి రోజూ సగటున రూ.12వేలు వరకు ఫీజు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రూ. 36వేలు వరకు బిల్లు ...
నార్పలలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కన్నకూతురిని హత్య చేసి బావిలో పడేశాడో కసాయి తండ్రి. ఆపై ఏమీ ఎరుగనట్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. గణేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పోలీసుల వద్ద అసలు నిజం బయటపెట్టాడు.
అనంతపురం: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసిన ఘటన తాడిపత్రి(Tadipatri) పట్టణం పాతకోట(Pathakota)లో కలకలం రేపింది. తాడిపత్రి పాతకోటలో నివాసం ఉండే దాదా పీర్‌కు రమీజతో ఐదు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని దాదాపీర్ అనుమానించేవాడు. ఈ విషయంపై ఆమెతో తరచూ గొడవపడేవాడు.
జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ప్రేమ వివాహానికి పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ములకలచెరువు మండలం దేవలచెరువు అడవుల్లో చోటుచేసుకుంది.
జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)...
వర్షాకాలం మొదలైంది. పాత భవంతులు, బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ‘అప్రమత్తంగా ఉండండి’ అని అధికారులు హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. ఒక్కోసారి రాకపోకలను నిలిపేసి.. దారి మళ్లిస్తుంటారు. ఇది రొటీన..! కానీ అనంతపురం నగరంలోని కొత్త ఫ్లైఓవర్ ‘అండర్ పాస్’ రాకపోకలను అధికారులు నిషేధించారు. దీన్ని ప్రారంభించి నెల గడిచిందేమో.. అంతే..! అంతలోనే మూసేయడం చర్చనీయాంశం అయ్యింది. ‘ఈ రోడ్డు అండర్ బ్రిడ్జి బీఆర్71ఏ భద్రత కారణంగా మూసివేయబడింది’ అని ఒక హెచ్చరిక బోర్డు పెట్టారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించడం ఏమిటో.. పోలింగ్ పూర్తవ్వగానే మూసేయడం ఏమిటో..! అని నగర ప్రజలు నిట్టూరుస్తున్నారు. ...
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి ఆదివారం తొలిసారి స్పందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఎన్నికల కౌటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల( (ap elections 2024)) సమరం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈసారి అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(anantapur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది బరిలో ఉన్నారు, ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దరఖాస్తుల మొదలు ఓటింగ్ వరకూ గందరగోళం కనిపిస్తోంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించి.. ఫారం-12 స్వీకరణలో సమస్యలను కొంతవరకూ సరిదిద్దారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 23,532 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. వీరందరికీ శుక్రవారం నుంచి ఈ నెల 6వతేదీ ...