Home » Ananthapuram
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్ నుంచి పంగళ్ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...
ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పుట్టిన రోజు వేడుకలను పార్టీ నాయకులు, శ్రేణులు, చిన్నారుల నడుమ సంతోషంగా జరుపుకున్నారు. ప్రజాగళం సభ కోసం శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన.. కణేకల్లులో శుక్రవారం రాత్రి బస చేశారు.
ఉరవకొండలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. బతుకు దెరువు కోసం తెల్లవారుజామునే బాక్సులు కట్టుకుని బొలేరో వాహనంలో 40 మంది కూలీలు వజ్రకరూరు నుంచి పాల్తూరుకు వెళుతున్నారు. అంతా హ్యాపీగా సందడి చేసుకుంటూ వెళుతుండగా.. గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బొలెరో టైర్ పంక్చరైంది. అంతే ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది.
జిల్లాలోని రాప్తాడులో ఆదివారం నాడు వైసీపీ(YSRCP) ‘‘సిద్ధం’’ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ‘‘సిద్ధం’ పేరుతో వైసీపీ సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది.
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.
జిల్లాలో ఓ భూమిపై వైసీపీ నేత కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఆ భూ యజమానిపై మొదట బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత అతను మాట వినడం లేదని భయాందోళనలకు గురిచేశాడు. ఇప్పుడు ఏకంగా అతనిపై హత్యయత్నానికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే... తాడిమర్రి మండలం నిడిగల్లు సమీపంలో 3.84 ఎకరాలను రాము నాయక్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు.
వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికలకు ముందు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇళ్ల కూల్చివేతలకు సైతం వెనుకాడటం లేదు. నేడు అనంతలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. 35 ఏళ్లుగా నివాసముంటున్న ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టే విషయంలో జగన చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలో కరువుపై పెడితే మంచిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ సూచించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని సీపీఐ కార్యాలయం బీటీ పక్కీరప్ప భవనలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.