Home » Ananthapuram
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో కాల్వ శ్రీనివాసుల దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా శాంతిపరుడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచ్చిన్నకర శక్తులు.. ఆరాచకాలకు దిగారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని... పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉదయం పరిటాల శ్రీరామ్ను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. అయితే వారి కళ్లు కప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు అనంతలో పర్యటించనున్నారు. ఈనెల 5న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో వేదవతి నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ చాలెంజ్, వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు.
గరంలోని చంద్ర ఆస్పత్రిలో ఇటీవల సంతాన సాఫల్య చికిత్స పొందుతూ మోదీన బీ మృతిచెందడానికి కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తిలో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి.