Home » Andhra Pradesh
రోజా ఫస్ట్రేషన్లో మదమెక్కి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. రోజా ఇక జీవితంలో నగరిలో గెలవదని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్వాల్.
జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.
అమరావతి రైతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సమావేశం అయ్యారు. ఈ మీటింగులో జరిగిన చిన్న ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. . అన్నదాతలతో సమావేశం ప్రారంభించే ముందు కొన్ని సూచనలు చేశానని ప్రస్తావించారు.
అనకాపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు తీసుకెళ్తున్న కుమార్తె.. తండ్రి కళ్లముందరే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.
రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.