Home » Andhra Pradesh
స్థానిక ఎంపీపీ ప్రసాద్ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్ శర్మ హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని వివేకా కుమార్తై సిబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.