Home » Andhra Pradesh
అటు చూడు.. అటు కాదు.. ఇటు చూడు.. నగరాలకు వెళ్లి ఏ వైపు చూసినా హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. ఎక్కడా ఖాళీ అనేదే ఉం డదు.
కంప్యూటర్‌లో ఈ-ఆఫీస్ ద్వారా మంత్రులకు వచ్చే ఫైళ్లను పరిష్కరించే విషయంలో కందుల దుర్గేష్ ఏడో స్థానంలో నిలిచారు.
ప్రభుత్వం అందిస్తున్న సర్వీస్‌ల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
జిల్లా కోర్టు సముదాయ స్థలానికి ప్రతిపాదనలు తయారు చేయాలని నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ ఆదేశించారు.
పట్టణంలోని పద్మావతినగర్‌లో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా జూడో జూనియర్ కేడెట్ బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.
మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.
మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.