Home » Andhrajyothi
శోభిత ధూళిపాళ్ల... ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ... తనదైన ముద్ర వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి. ఈ ఏడాది ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత... నాగచైతన్యతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని విశేషాలివి...
‘‘టక్..టక్- టక్..టక్..’’ రాత్రిపగలన్న తేడాలేదు. ఊరంతా ఒకటే శబ్దం. ఒకవైపు మనుషులు, మరోవైపు మర మగ్గాలు పోటీపడి వస్త్రాలు తయారవుతున్నాయి. ఇళ్లల్లో ఎవరి పని వారిదే!. మాటల్లేవు.. పనొక్కటే మాట్లాడుతోంది. వీధులన్నీ రంగురంగుల దారాలతో నిండిపోయాయి.
ఒంటరిగా ఉండటం వేరు... ఏకాంతంగా ఉండటం వేరు. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు... అన్నింటికీ దూరంగా... వ్యక్తిగతంగా ఈ రోజుల్లో కాస్త ఏకాంతాన్ని దక్కించుకోవడం, కాస్త సమయాన్ని చేజిక్కించుకోవడం కష్టసాధ్యమే. ఎవరి కోసమో ఎదురుచూడకుండా... ఒక హోటల్లో కూర్చుని ‘టేబుల్ ఫర్ వన్... ప్లీజ్’ అనాల్సిందే... ఏకాంతం (దీన్నే సోలో డేటింగ్ అంటున్నారు) వల్ల చాలా లాభాలున్నాయి మరి...
ఆ బడిలో పాఠాలు, మంచి బుద్ధులు బోధించరు. దొంగతనం ఎలా చేయాలి? దోపిడీలకు ఎలా పాల్పడాలి? ఒకవేళ దొంగతనం చేస్తుండగా పట్టుబడితే చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి? అనే ‘చోరకళ’ నేర్పిస్తారు.
దక్షిణాది ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్(Hyderabad)ను దేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్ డా. గాలి వినోద్ కుమార్(Dr. Gali Vinod Kumar) డిమాండ్ చేశారు.
కాన్వాస్ మీద రంగురంగుల బొమ్మలు వేయడం అందరికీ తెలిసిన విద్య. అయితే ఇరాన్ చిత్రకారుడు ఒమిద్ అసదీ తన చిత్రకళకు భిన్నమైన కాన్వాస్‌ను ఎంచుకున్నాడు. చెట్ల నుంచి రాలిపడిన ఎండుటాకులపై... సూదులు, కట్టర్లే కుంచెలుగా చేసుకుని... అతడు అత్యంత ఓపికగా చెక్కే పత్ర శిల్పాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా జపాన్ను గుర్తిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల తాకిడిని తట్టుకుని, టెక్నాలజీలో ప్రపంచానికే సవాల్ విసిరింది. అలాంటి దేశంలో ప్రస్తుతం అబాండెడ్ హౌస్‌లు (వదిలేసిన ఇళ్లు) 90 లక్షలున్నాయి.
కచ్చితంగా వారానికోసారి బెడ్‌షీట్స్‌ను ఉతకాల్సిందే. బెడ్ మీదనే కూర్చుని ఆహారం తినటం, మన చర్మం మీద ఉండే మృతకణాలు, బయట తిరిగి అదే కాళ్లతో పిల్లలు బెడ్ మీద ఆడుకోవటం వల్ల బెడ్‌షీట్స్ త్వరగా మాసిపోతాయి. వాటిపై కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది.
సాస్, కెచప్, మయోనీస్ వాడకం కేవలం రెస్టారెంట్లలో మాత్రమే కాక ఈ మధ్య ఇళ్లల్లో కూడా పెరిగింది. ఈ సాస్‌లను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు... వాటి రుచి, రంగు ఆకర్షణీయంగా ఉండేందుకు వివిధరకాల ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ వంటివి వాటి తయారీలో వాడతారు.
చలి మొదలయ్యింది. దాన్నుంచి రక్షించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు... మామూలే. వీటికి ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ కూడా తోడయ్యాయి. అరిచేతులు, అరికాళ్లు క్షణాల్లో వెచ్చగా మారాలన్నా, మఫ్లర్‌తో పాటు ఎంచక్కా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా సాధ్యమే. చలికి చెక్ పెడుతూ, వెచ్చ దనాన్ని అందించే వాటి విశేషాలే ఇవి...