Home » Andhrajyothi
చలి మొదలయ్యింది. దాన్నుంచి రక్షించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు... మామూలే. వీటికి ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ కూడా తోడయ్యాయి. అరిచేతులు, అరికాళ్లు క్షణాల్లో వెచ్చగా మారాలన్నా, మఫ్లర్‌తో పాటు ఎంచక్కా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలన్నా సాధ్యమే. చలికి చెక్ పెడుతూ, వెచ్చ దనాన్ని అందించే వాటి విశేషాలే ఇవి...
తిరుమల మహత్యమే అలాంటిది..! ఆ ఏడుకొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు.. ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది.. గోవింద నామస్మరణతో తనువు పుణీతం అవుతుంది. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే.. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ పాట గుర్తుకు వస్తుంది.
సాధారణంగా 70 ఏళ్లు దాటితే ‘కృష్ణా, రామా’ అనుకుంటూ శేష జీవితాన్ని గడుపుతారు చాలామంది. విశాఖకు చెందిన 102 ఏళ్ల వల్లభజోస్యుల శ్రీరాములు మాత్రం ఇందుకు భిన్నం. వందేళ్లు దాటినా వెటరన్ అథ్లెట్‌గా... అనేక దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తున్నారు. తన ఆరోగ్య చిట్కాలు, రోజువారీ జీవన విధానం ఆయన మాటల్లోనే...
పార్కులో యోగాకు వెళ్లాలంటే ఒక యోగా మ్యాట్, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. అదే యోగా స్టూడియోలో అయితే ఈమధ్య ‘యోగా వీల్’ కూడా ఉంటోంది. కాన్సెప్ట్ పాతదే కానీ... మోడ్రన్‌గా ఉండే ఈ ‘చక్రం’ నవతరాన్ని ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏమిటీ యోగా వీల్?
‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్లతో రష్మిక మందన్న నేషనల్ స్టార్‌గా మారింది. ‘సామీ’ అంటూ అందర్నీ కట్టిపడేసిన శ్రీవల్లి ‘పుష్ప- ది రూల్’లో ఎలా ఉంటుందా? అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది.
రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు మనదేశంతో పాటు శ్రీలంకలో కూడా ఉన్నాయనే విషయం జగద్విదితమే. ఇప్పుడు ఆ ఆనవాళ్లనే శ్రీలంక తన పర్యాటక సోపానాలుగా మార్చుకుంటోంది. ‘రామాయణ గాథను కళ్లకు కట్టినట్లు నేరుగా చూపించేందుకు మేము సిద్ధం’ అంటోంది శ్రీలంక విమానయాన సంస్థ.
ఒక ఆలయంలో... ఒక గొప్ప యుద్ధంలో అమరులైన వారిని గత 800 ఏళ్లుగా స్మరించుకోవడం విశేషమే. అంతేకాదు... ప్రతీ యేడాది కార్తీకమాసం చివర్లో అక్కడ ఘనంగా జరిగే ఉత్సవాలను చూసి తీరాల్సిందే. వాటిని చూడాలంటే గుంటూరు జిల్లా కారంపూడికి వెళ్లాల్సిందే.
అందాల తారలు అనన్య పాండే, ఖుషీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో తెగ వైరలైంది. వారి ఔట్ఫిట్స్, హెయిర్ స్టైల్ లేదా జ్యువెలరీ గురించే సెర్చింగ్ అనుకుంటే ఈ ఫ్యాషన్ దునియాలో మీరు వెనకపడ్డట్టే. ఎందుకంటే ఆ భామల చేతిలో ఉన్నది ‘మొబైల్ చార్మ్స్’. అంటే మొబైల్ గొలుసులన్నమాట. చేతికి బ్రాస్లెట్లాగే ఫోన్‌కు ఇదో ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఇదే సరికొత్త ట్రెండ్.
ఉడికిన పిమ్మట మిరియము పొడి బెల్లము చల్లి యుద్దుపొడి రాలిచి నే తిడి నెఱ్ఱఁగ వేఁచిన వేఁపుడుఁగంద మిళిందవేణి పొందుగ నిడియెన్
కావలసిన పదార్థాలు: రవ్వ - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - తగినంత, ఉప్పు - చిటికెడు.