Home » andhrajyothy
పొగాకు, ఆలు, టమాటా, మిరపకాయల్ని స్పెయిన్ ద్వారా అందుకుని పోర్చు గీసులు మనకు తెచ్చి పరిచయం చేశారు. పాండురంగడి శక్తిమిరప ఘాటులా ఉంటుందంటాడు ఓ కీర్తనలో పురందరదాసు.
సాధారణంగా ధ్యానం అనేది సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ధ్యానానికి మధ్యలో అంతరాయం కలగొద్దు. ‘మైక్రో మెడిటేషన్’ అంటే... కాస్త విరామం తీసుకుంటూనే, కొన్ని నిమిషాల వ్యవధిలో మెదడు, శ్వాసను నియత్రించడం.
1965లో జన్మించిన ఈయనగారు.. 25వ ఏట తన పేరును 2వేల కంటే ఎక్కువ పదాలకు పెంచు కోవాలని నిర్ణయించుకున్నారట. దాంతో 1990లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. స్థానిక జిల్లా కోర్టు దానికి అనుమతించింది. అయితే, విచారణ సమయంలో రిజిస్ట్రార్ జనరల్ దాన్ని తిరస్కరించారు.
అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాళ, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారాపూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని. బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.
చిటపట కాలుతున్న కమ్మని వాసన.. వేగిన గింజల గళగళలు.. టప్‌టప్‌మంటూ ఒక్కొక్క గింజనే పగలగొడుతున్న శబ్దాలు.. ప్రత్యేకించి యంత్రాల సందడి.. ఇలా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపిస్తారు. అతి ఖరీదైన గింజల్ని.. అతి కష్టం మీద ఉత్పత్తి చేసే శ్రమైక జీవన సౌందర్యం చూపరులను అబ్బురపరుస్తుంది.
లిక్టన్స్టైన్... స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల నడుమ ఓ రత్నంలా వెలుగులీనుతోందీ బుల్లి దేశం. చాలామందికి ఈ దేశం ఉన్నట్టే తెలియదు. దేశం మొత్తం సుమారు 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. అంటే తిప్పికొడితే... మన హైదరాబాద్ నగరమంత కూడా ఉండదు.
ఐస్‌ల్యాండ్... ఆ పేరు వింటేనే మంచును తాకిన అనుభూతి కలుగుతుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ దేశానికి వెళ్తే చలికి గడ్డకట్టుకపోవాల్సిందే. అయితే అక్కడ ఉష్ణగుండాలు ఉండడం భౌగోళికంగా ఆశ్చర్యం కలిగించే విషయం. భూ ఉష్ణశక్తిని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఐస్లాండ్ ఒకటి. ఈ శీతల దేశానికి టూరిస్టుల సందడి ఎక్కువే.
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. వేడుకను ఆర్భాటంగా చేస్తారుని, పరిస్థితులు చక్కబడతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుందని, ఖర్చులు విపరీతంగా ఉంటాయని, చేస్తున్న పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
పొలం పనులకు ట్రాక్టర్ ఉంటే ఆ భరోసానే వేరు. అయితే ట్రాక్టర్లో డీజిల్, దానిని నడిపేందుకు ఒక డ్రైవర్... కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అదే ఈ మినీ ట్రాక్టర్‌ను పొలం గట్టుమీద కూర్చొని ఎంచక్కా రిమోట్‌తో నడపొచ్చు. డ్రైవర్‌తో పనే ఉండదు.
ప్రయాణాలు, యాత్రల సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, ప్రయాణంలో అలసట, నీటి మార్పులాంటి కారణాలతో శరీరానికి జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, శుభ్రంగా చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.