Home » andhrajyothy
విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
క్రికెట్లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆటగాళ్లే మైదానంలో చరుకుగా కదులుతారు. బాగా ఆడగలరు. క్రికెటర్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. క్రికెట్ బోర్డులు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించిన ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
మణిపూర్‌లో ఇకపై అంబులెన్స్‌లకు (Ambulance) వాడే సైరెన్ డిఫరెంట్‌గా ఉండాలని వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం స్పష్టంచేసింది. అంబులెన్స్‌లకు (Ambulance) ఇచ్చే సైరన్ మరే వాహనాలను ఉండకూడదని తేల్చిచెప్పింది.
శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాధరెడ్డి వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్టీపీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందన్నారు.
IPL auction: మరికాసేపట్లో ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభంకానుంది. 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్న ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.262 కోట్ల వరకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది.
అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
యావత్ భారతావని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్-3 మిషన్‌పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) తాజా సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (PM) కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు ప్రకటించింది.
కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు కానీ, చిత్రం కానీ, ప్రాంతం కానీ ఇలా రకరకాలవి చూసినప్పుడు అంతా చూశామని భావిస్తాం. కానీ దాని గురించిన ఏదైన విషయం అడిగినప్పుడు తికమకపడుతుంటాం.