Home » Andhrapradesh
బాలుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. మేనమామే హంతకుడు.. అని పోలీసులు నిర్ధారించారు. కొమ్మెర హర్షవర్ధన్ అనే బాలుడిని అతని సొంత మేనమామే చంపేశాడు. జిల్లా వ్యాప్తంగా సంచలనానికి దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఈ ఏడాది దానిమ్మ రైతు పంట పండింది. మార్కెట్లో దానిమ్మకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దానిమ్మ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.10 లక్షల వరకు పలుకుతోంది. దీంతో దానిమ్మ సాగుచేసిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.
తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు.
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబై అందరినీ ఆకర్షించారు. ఈ వింత సంప్రదాయం ప్రకాశం జిల్లాలో జరిగింది.
తగిన ఆధారాలు చూపించి పాపను తీసుకెళ్లాలని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు సొంత కార్లను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు.. మరికొందరు అధికారులు వాహనాలు వాడకుండానే నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు.
రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్మాల్ చేసింది మార్కెటింగ్ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న కొటాక్ మహేంద్ర బ్యాంకు ఉంది.