Home » Andhrapradesh
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు.
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగ్రాతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ... మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు మార్గంసుగుమం చేస్తూ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కొనసాగుతోంది.
Andhrapradesh: సెబి అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని...
Andhrapradesh: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఈమేరకు బుధవారం షెడ్యూల్ను కమిటీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కును మూసివేసే దిశగా చర్యలు ఆగలేదని... స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈనెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంపై ప్రభుత్వ, విపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘‘తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరు’’ అంటూ మంత్రి వంగ్యాస్త్రాలు సంధించారు.
‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం’లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి చేరుకున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది.
నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా.. చిన్న నగరాలకు కూడా విస్తరించిందని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్, సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.