Home » Andhrapradesh
Andhrapradesh: ‘తల్లికి వందనం’ పథకంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంపై విద్యార్థి తల్లిదండ్రులలో అనుమానం ఉందన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అందరికీ తల్లికి వందనం పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు.
ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ..
Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
తమ కుమార్తె కనిపించడం లేదంటూ భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. యువతి మిస్సింగ్ వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా సీఐకి ఫోన్ చేసి మాట్లాడిన ఈ కేసులో కీలక పురోగతి లభించించింది.
Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇరు ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి విడుదల చేశారు.
నరసాపురం బీజేపీ ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు.