Home » Andhrapradesh
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.
పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.
ప్రభుత్వ శాఖల ఖజానాను ఖాళీ చేసి మరీ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్’ (ఏపీఎస్‌ఎ్‌ఫసీ)లోకి డిపాజిట్ల రూపంలో జమ చేయించారు. కానీ...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఎపిసోడ్లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం(EVM Damage Case) కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు(AP Police) ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
తోటలకు వైరస్ సోకడంతో దానిమ్మ రైతులు కుదేలవుతున్నారు. వైరస్‌ను అదుపు చేయలేక పండ్ల తోటలనే తొలగించేస్తున్నారు. హార్టికల్చర్ హబ్‌గా పేరుగాంచిన ఎల్బీనగర్లో అతివృష్టి, అనావృష్టికి వైరస్ తోడవడంతో దానిమ్మ రైతు కోలుకోలేకపోతున్నాడు. ఈ క్రమం లోనే లక్షలు వెచ్చించి సాగు చేసిన దానిమ్మ పంటను తొలగించి ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. గతంలో నాలుగు వేల హెక్టార్లలో దానిమ్మ సాగులో ఉండగా నేడు అది 1500 హెక్టార్లకు పడిపోయింది. ...
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని