Home » AP Assembly Sessions
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్‌పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.
ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.
శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.
61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు.
గత అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యంతో కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయనే అంశంపై మాట్లాడిడే.. ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసిందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి నారా లోకేష్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి మాట్లాడారు. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.