Home » AP BJP
‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్పర్సన్ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.
ఒక్కో మనిషికి, ఒక్కో పార్టీకి లక్కీ నెంబర్ అంటూ ఉంటుంది. నెంబర్ అవసరం వచ్చినప్పుడల్లా లక్కీ నెంబర్‌ను ఎంచుకుంటారు. కొన్నిసార్లు ఎంచుకోకపోయినా ఒక నెంబర్ లక్కీ నెంబర్‌గా మారిపోతుంది. యాదృశ్చికంగా జరిగినా అది నిజంగా ఆ పార్టీ లక్కీ నెంబర్ ఏమో అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మేనిఫెస్టోను (NDA Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? ఫోటోలు ఎందుకు లేవు..? అనే విషయాలపై క్లియర్ కట్‌గా చంద్రబాబే చెప్పినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.