Home » AP BJP
Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.
TDP MP Candidates List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) గెలుపే లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమిగా ఏర్పడిన రోజే గెలిచిపోయామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక అభ్యర్థుల ప్రకటనలో యమా జోరుమీదున్న టీడీపీ.. ఇప్పటిదే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది..
‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా
TDP-JSP-BJP Praja Galam Sabha: ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ రాష్ట్ర వికాసం కోసం పవన్, చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ(BJP) పార్టీ చేరికలపై దృష్టి సారించింది. పలు పార్టీల్లోని నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు.
ప్రధాని మోదీ, బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ఏపీలో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకి అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. కొన్ని వార్తా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలు.. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి (TDP BJP Janasena Alliance) ఘనవిజయం సాధిస్తుందని ఆ సర్వేలు తెలిపాయి. ఈ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించాయి.
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..