Home » AP Cabinet Meet
Andhrapradesh: మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..!
Andhrapradesh: ఆంధ్రప్రదశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరుగనుంది. పోలవరం డయాఫ్రం వాల్పై కేబినెట్లో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారి 45 రోజులు దాటింది కూడా..! అయినా సరే ఇంకా పాత వాసనలు పోలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి..!
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్ట్లకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది...
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది.